అధ్యాయం 16

దైవాసురసమ్పద్విభాగయోగ

అథ షోడశోఽధ్యాయ

24 విభాగాలు
దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 1, 2 మరియు 3

శ్రీభగవానువాచ |

అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః |

దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ||౧౬-౧||

అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్ |

దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ||౧౬-౨||

తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా |

భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత ||౧౬-౩||

శ్రీభగవానువాచ

అనువాదం

శ్రీ భగవానుడు పలికెను: ఓ భరత వంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో - నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢసంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంథ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం; అహింస, సత్య సంధత, క్రోధము లేకుండుట, త్యాగం, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణులపట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణకువ, మరియు నిశ్చలత్వము; బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట, మరియు దురభిమానం లేకుండుట.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 4

దమ్భో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ |

అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్ ||౧౬-౪||

అనువాదం

ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానం అనేవి ఆసురీ స్వభావముకల వారి గుణములు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 5

దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా |

మా శుచః సమ్పదం దైవీమభిజాతోఽసి పాణ్డవ ||౧౬-౫||

అనువాదం

దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ, ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. శోకింపకుము అర్జునా, నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 6

ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్దైవ ఆసుర ఏవ చ |

దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ||౧౬-౬||

అనువాదం

ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు - దైవీ గుణములు కలిగి ఉన్నవారు మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను, ఓ అర్జునా, ఆసురీ స్వభావమును గురించి చెప్తాను, వినుము.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 7

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః |

న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ||౧౬-౭||

అనువాదం

ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ, లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 8

అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ |

అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్ ||౧౬-౮||

అనువాదం

వారు ఇలా అంటారు, ‘ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన (నైతిక నియమ) ఆధారము లేదు, మరియు భగవంతుడు (దీనిని సృష్టించింది లేదా నిర్వహించేది) అనేవాడు ఎవరూ లేడు. ఇదంతా స్త్రీ-పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు. ’ అని.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 9

ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః |

ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః ||౧౬-౯||

అనువాదం

ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి, ఈ తప్పుదోవపట్టిన జీవాత్మలు, అల్ప బుద్ధితో మరియు క్రూర (ఉగ్ర) కార్యములతో, ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయభయపెడుతారు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 10

కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః |

మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేఽశుచివ్రతాః ||౧౬-౧౦||

అనువాదం

తృప్తిపరచలేని కామముతో ఉంటూ, దంభము, దురభిమానము, మరియు గర్వముతో నిండిపోయి, ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకునివుంటారు. ఈ విధంగా మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 11 మరియు 12

చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః |

కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ||౧౬-౧౧||

ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః |

ఈహన్తే కామభోగార్థమన్యాయేనార్థసఞ్చయాన్ ||౧౬-౧౨||

అనువాదం

వారు అంతులేని చింతలు/ఆందోళనలచే సతమతమై పోతుంటారు, అవి చివరికి మరణం తోనే ముగుస్తాయి. అయినా సరే, వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు. వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడి, మరియు కామ క్రోధములచే ఆవరించబడి, వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగుచేయటానికి శ్రమిస్తారు, ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 13, 14, 15, 16

ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్ |

ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ||౧౬-౧౩||

అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి |

ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ ||౧౬-౧౪||

ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా |

యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ||౧౬-౧౫||

అనేకచిత్తవిభ్రాన్తా మోహజాలసమావృతాః |

ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేఽశుచౌ ||౧౬-౧౬||

అనువాదం

ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు, ‘నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా వస్తుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు, మరియు నేను మిగతావారిని కూడా నాశనం చేస్తాను! నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేను దోశరహితుడను, నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకు ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను (దేవతలకు) యజ్ఞములు చేస్తాను; దానములు ఇస్తాను; ఆనందిస్తాను. ’ ఈ విధంగా, వారు అజ్ఞానంచే భ్రమపడుతుంటారు. ఇటువంటి ఊహలు, తలంపులతో తప్పుదారి పట్టి, చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి, మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 17

ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః |

యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్ ||౧౬-౧౭||

అనువాదం

ఇటువంటి దురహంకారముతో మరియు మొండిపట్టుదల గల మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి, శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 18

అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః |

మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోఽభ్యసూయకాః ||౧౬-౧౮||

అనువాదం

అహంకారము, బలము, గర్వము, కామము, మరియు కోపముచే కళ్ళుమూసుకుపోయి, ఈ అసురీ ప్రవృత్తి కలవారు, తమ దేహంలో మరియు ఇతరుల దేహంలో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ/ద్వేషిస్తూ ఉంటారు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 19

తానహం ద్విషతః క్రురాన్సంసారేషు నరాధమాన్ |

క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ||౧౬-౧౯||

అనువాదం

క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు, అధములు, నీచ నరులను, నేను, భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో, పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక, ఓ అర్జునా, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 20

ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని |

మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్ ||౧౬-౨౦||

అనువాదం

క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు, అధములు, నీచ నరులను, నేను, భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో, పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక, ఓ అర్జునా, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 21

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః |

కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ||౧౬-౨౧||

అనువాదం

ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు మూడు ఉన్నాయి - కామము, క్రోధము, మరియు లోభము. కాబట్టి, అందరూ వీటిని విడిచిపెట్టాలి.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 22

ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్త్రిభిర్నరః |

ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్ ||౧౬-౨౨||

అనువాదం

చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు, ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు, తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 23

యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః |

న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ||౧౬-౨౩||

అనువాదం

ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరకి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు.

దైవాసురసమ్పద్విభాగయోగ

శ్లోక 24

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ |

జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ||౧౬-౨౪||

అనువాదం

కాబట్టి, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధివిధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము మరియు ఆవిధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా సుపనిషత్సు బ్రహ్మవిద్యామ్ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవదే దైవసురసంపాదస్వయౌగో నామ షోడశోఽధ్యాయః

కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.

పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.

ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి

  • అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
  • సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
  • లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
Video Generation Preview

లోతైన అనుభూతిని పొందండి

నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.