దైవాసురసమ్పద్విభాగయోగ - శ్లోకం శ్లోక 7
శ్లోక 7
ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః |
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ||౧౬-౭||
అనువాదం
ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ, లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు.