దైవాసురసమ్పద్విభాగయోగ - శ్లోకం శ్లోక 6
శ్లోక 6
ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్దైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ||౧౬-౬||
అనువాదం
ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు - దైవీ గుణములు కలిగి ఉన్నవారు మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను, ఓ అర్జునా, ఆసురీ స్వభావమును గురించి చెప్తాను, వినుము.