అర్జునవిషాదయోగ
అథ ప్రథమోఽధ్యాయ
శ్లోక 4, 5 మరియు 6
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||౧-౪||
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||౧-౫||
యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||౧-౬||
అనువాదం
వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.
శ్లోక 8 మరియు 9
భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిఞ్జయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||౧-౮||
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||౧-౯||
అనువాదం
మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగి ఉన్నారు.
శ్లోక 15
పాఞ్చజన్యం హృషీకేశో దేవదత్తం ధనఞ్జయః |
పౌణ్డ్రం దధ్మౌ మహాశఙ్ఖం భీమకర్మా వృకోదరః ||౧-౧౫||
అనువాదం
హృషీకేశుడు, పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు, మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి భీముడు, పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను.
శ్లోక 16
అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ||౧-౧౬||
అనువాదం
ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.
శ్లోక 17 మరియు 18
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||౧-౧౭||
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||౧-౧౮||
అనువాదం
ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు. గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.
శ్లోక 20
అథ వ్యవస్థితాన్దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసమ్పాతే ధనురుద్యమ్య పాణ్డవః |
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ||౧-౨౦||
అనువాదం
ఆ సమయంలో, తన రథం ధ్వజంపై హనుమంతుని చిహ్నం కలిగి ఉన్న పాండుపుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచి ఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.
శ్లోక 21, 22, 23
అర్జున ఉవాచ |
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ||౧-౨౧||
యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ||౧-౨౨||
యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః ||౧-౨౩||
అనువాదం
అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుతా (శ్రీకృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము. ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి. దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రున్ని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.
శ్లోక 24 మరియు 25
సఞ్జయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||౧-౨౪||
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||౧-౨౫||
అనువాదం
సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించినవాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను. భీష్ముడు, ద్రోణాచార్యుడు, మరియు ఇతర రాజుల సమక్షంలో, శ్రీ కృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పార్థా, ఇక్కడ కూడి ఉన్న కురు వంశస్థులను చూడుము.
శ్లోక 26
తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితౄనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతౄన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా ||౧-౨౬||
అనువాదం
అక్కడ, రెండు సైన్యములలోనూ ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, దాయాదులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, మేనల్లుళ్లను, మరియు శ్రేయోభిలాషులను అర్జునుడు చూచెను.
శ్లోక 28, 29, 30, 31
కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |
అర్జున ఉవాచ |
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ||౧-౨౮||
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ||౧-౨౯||
గాణ్డీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ||౧-౩౦||
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ||౧-౩౧||
అనువాదం
అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కృష్ణా, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోటానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి, నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది. నా శరీరమంతా వణుకుచున్నది; నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా విల్లు, గాండీవం, చేజారిపోతున్నది, మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది; ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణా, కేశి రాక్షసుడను సంహరించినవాడా, అంతటా అశుభ శకునములే కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో సొంత బంధువులనే చంపుకోవటం వలన, మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకున్నాను.
శ్లోక 32
న కాఙ్క్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవిన్ద కిం భోగైర్జీవితేన వా ||౧-౩౨||
అనువాదం
ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది?
శ్లోక 33 మరియు 34
యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||౧-౩౩||
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సమ్బన్ధినస్తథా ||౧-౩౪||
అనువాదం
ఓ కృష్ణా, నాకు విజయం కానీ, రాజ్యం కానీ, వాటివల్ల వచ్చే సుఖం కానీ అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు, రాజ్యంతో కానీ, సుఖాల వలన కానీ, ఇక ఈ జీవితం వల్ల కానీ ప్రయోజనం ఏముంది? గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసిననూ నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిననూ, ఈ భూ-మండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే, ఏం తృప్తి ఉంటుంది మనకు?
శ్లోక 35
ఏతాన్న హన్తుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||౧-౩౫||
అనువాదం
గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావ మరుదులు, ఇంకా ఇతర బంధువులు, వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ, ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసిననూ నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించిననూ, ఈ భూ-మండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే, ఏం తృప్తి ఉంటుంది మనకు?
శ్లోక 36
నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః ||౧-౩౬||
అనువాదం
ఓ జనార్దనా, (సర్వ భూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా), ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులయినా, వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా (కృష్ణా), మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము?
శ్లోక 37
తస్మాన్నార్హా వయం హన్తుం ధార్తరాష్ట్రాన్స్వబాన్ధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ ||౧-౩౭||
అనువాదం
ఓ జనార్దనా, (సర్వ భూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా), ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులయినా, వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవా (కృష్ణా), మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము?
శ్లోక 38 మరియు 39
యద్యప్యేతే న పశ్యన్తి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ ||౧-౩౮||
కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||౧-౩౯||
అనువాదం
వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి, బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గానీ, వారు దోషం చూడటం లేదు. కానీ, ఓ జనార్దనా (కృష్ణా), మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము, ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు?
శ్లోక 45
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||౧-౪౫||
అనువాదం
అయ్యో! ఎంత ఆశ్చర్యం, దారుణమైన పరిణామాలు కలిగించే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్ధ పడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే, అది దీనికంటే మేలే.
శ్లోక 46
యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ ||౧-౪౬||
అనువాదం
అయ్యో! ఎంత ఆశ్చర్యం, దారుణమైన పరిణామాలు కలిగించే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్ధ పడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే, అది దీనికంటే మేలే.
కేవలం చదవడం మాత్రమే కాదు—
మీ స్వంత ధ్యాన వీడియోలను సృష్టించండి.
పవిత్ర శ్లోకాలను ప్రపంచంతో పంచుకోవడానికి అందమైన, సినిమాటిక్ వీడియోలుగా మార్చండి. మీ నేపథ్యాన్ని ఎంచుకోండి, మంత్రోచ్ఛారణ ఆడియోను జోడించండి మరియు ఆధునిక ఆకృతిలో గీత వెలుగును ప్రసరింపజేయండి.
ఈ ఫీచర్ల కోసం యాప్ డౌన్‌లోడ్ చేయండి
- అధిక నాణ్యత గల నేపథ్య కళాకృతి
- సమకాలీకరించబడిన సంస్కృత మరియు అర్థ పాఠం
- లీనమయ్యే మంత్రోచ్ఛారణ & సంగీతం
లోతైన అనుభూతిని పొందండి
నిత్య గీత పూర్తి వెర్షన్తో సినిమాటిక్ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించండి. అధిక నాణ్యత గల మంత్రోచ్ఛారణ, ప్రామాణిక అనువాదాలు మరియు మీ అరచేతిలో ఒక ప్రశాంతమైన ధ్యాన అభయారణ్యం.