అర్జునవిషాదయోగ - శ్లోకం శ్లోక 13
శ్లోక 13
తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోఽభవత్ ||౧-౧౩||
అనువాదం
ఆ తరువాత, శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు, మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి, మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను.