అర్జునవిషాదయోగ - శ్లోకం శ్లోక 44
అర్జునవిషాదయోగ
శ్లోక 44
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ||౧-౪౪||
అనువాదం
ఓ జనార్దనా (కృష్ణా), కులాచారములను నాశనం చేసిన వారు నిరవధికముగా నరకములోనే ఉంటారని, నేను పండితుల నుండి వినియున్నాను.