రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 11
శ్లోక 11
అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్ ||౯-౧౧||
అనువాదం
నేను నా సాకారమనుష్య రూపంలో అవతరించినప్పుడు, మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు మహేశ్వరుడైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు.