రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 29
శ్లోక 29
సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః |
యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ||౯-౨౯||
అనువాదం
నేను సర్వ ప్రాణుల యందు సమత్వ బుద్ధితో ఉంటాను, నేను ఎవరి పట్ల పక్షపాతంతో కానీ లేదా విరోధ భావం తో కానీ ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు నాయందే నివసిస్తారు మరియు నేను వారి యందు నివసిస్తాను.