అక్షరబ్రహ్మయోగ - శ్లోకం శ్లోక 3
శ్లోక 3
శ్రీభగవానువాచ |
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ||౮-౩||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: సర్వోన్నతమైన, నాశములేని తత్త్వమునే బ్రహ్మన్ అందురు; వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వమునే అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్త్వమునకు మరియు వాటి అభివృద్దికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు.