అక్షరబ్రహ్మయోగ - శ్లోకం శ్లోక 4
శ్లోక 4
అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ |
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ||౮-౪||
అనువాదం
దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా, నిరంతరం మారుతునే ఉండే ఈ భౌతిక సృష్టినే అదిభూత అంటారు; సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే అధిదైవము అంటారు; సర్వ భూతముల హృదయములలో నివసించే నేను అధియజ్ఞము, అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు, అని పిలువబడుతాను.