ధ్యానయోగ - శ్లోకం శ్లోక 7 మరియు 8
శ్లోక 7 మరియు 8
జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః |
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ||౬-౭||
జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాఞ్చనః ||౬-౮||
అనువాదం
మనస్సుని జయించిన యోగులు - శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు - ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు. జ్ఞానవిజ్ఞానంలతో మరియు విచక్షణతో తృప్తినొందిన యోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు – మట్టి, రాళ్ళు, మరియు బంగారము – వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు.