ధ్యానయోగ - శ్లోకం శ్లోక 26
శ్లోక 26
యతో యతో నిశ్చరతి మనశ్చఞ్చలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ||౬-౨౬||
అనువాదం
ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి.