కర్మయోగ - శ్లోకం శ్లోక 39
శ్లోక 39
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ ||౩-౩౯||
అనువాదం
అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా, ఎప్పటికీ తృప్తిపఱుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది, ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలె మండుతూనే ఉంటుంది, ఓ కుంతీ పుత్రుడా.