సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 18
శ్లోక 18
అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః |
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ||౨-౧౮||
అనువాదం
ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది; అందున్న జీవాత్మ అవినాశిది, కొలవశక్యముకానిది, మరియు నిత్యశాశ్వతమైనది. కావున, ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము.