సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 19
శ్లోక 19
య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే ||౨-౧౯||
అనువాదం
ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు - ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతనూ చంపబడదు.