సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 1
శ్లోక 1
సఞ్జయ ఉవాచ |
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదన్తమిదం వాక్యమువాచ మధుసూదనః ||౨-౧||
అనువాదం
సంజయుడు పలికెను: జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు, ఈ విధంగా పలికెను.