విశ్వరూపదర్శనయోగ - శ్లోకం శ్లోక 5
శ్లోక 5
శ్రీభగవానువాచ |
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ||౧౧-౫||
అనువాదం
భగవానుడు పలికెను: వివిధములైన ఆకృతులు, పరిమాణములు, మరియు వర్ణములతో ఉన్న వందల వేల అద్భుతమైన నా యొక్క స్వరూపములను, ఇదిగో తిలకించుము ఓ పార్థ.