అక్షరబ్రహ్మయోగ - శ్లోకం శ్లోక 27
శ్లోక 27
నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ||౮-౨౭||
అనువాదం
ఈ రెండు మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు, ఓ పార్థా, ఎన్నటికీ మోహమునకు గురి కారు. కాబట్టి, సర్వదా (అన్ని సమయాల్లో) యోగములో స్థితుడవై (భగవంతునితో ఏకమై) ఉండుము.