అక్షరబ్రహ్మయోగ - శ్లోకం శ్లోక 12 మరియు 13
శ్లోక 12 మరియు 13
సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూధ్న్యార్ధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ ||౮-౧౨||
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్ ||౮-౧౩||
అనువాదం
శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి, మనస్సుని హృదయ స్థానము యందే నిలిపి, ప్రాణములను మూర్ధ్న్యా (తల) స్థానములోకి లాగి, వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానములో స్థితుడై ఉండవలెను. పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ, ఓం కారమును జపిస్తూ, శరీరము నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమ గతిని పొందును.