ధ్యానయోగ - శ్లోకం శ్లోక 43
శ్లోక 43
తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునన్దన ||౬-౪౩||
అనువాదం
ఇటువంటి జన్మ పొందిన తరువాత, ఓ కురు వంశస్తుడా, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు.