పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 10
శ్లోక 10
ఉత్క్రామన్తం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః ||౧౫-౧౦||
అనువాదం
అది ఇంద్రియ వస్తువిషములను ఆనందిస్తూ దేహంలోనే ఉన్నప్పుడు కానీ లేదా అది దేహంను విడిచివెళ్లినప్పుడు కానీ, జీవాత్మను అజ్ఞానులు గమనించరు. కానీ జ్ఞాన నేత్రములు కలవారు దానిని దర్శించగలరు.