పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 6
శ్లోక 6
న తద్భాసయతే సూర్యో న శశాఙ్కో న పావకః |
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ||౧౫-౬||
అనువాదం
సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.