పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 18
శ్లోక 18
యస్మాత్క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః |
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||౧౫-౧౮||
అనువాదం
నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థముకంటెనూ, మరియు అవినాశి జీవాత్మ కంటెనూ కూడా అతీతమైనవాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే పరమ దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను.