రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 4
శ్లోక 4
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ||౯-౪||
అనువాదం
ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి కాని నేను వాటి యందు స్థితుడనుకాను.