రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 24
శ్లోక 24
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ||౯-౨౪||
అనువాదం
సమస్త యజ్ఞములకు భోక్తను, ఏకైక స్వామిని నేనే. కానీ, నా ఈ యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొనని వారు తిరిగి పుట్టవలసినదే.