రాజవిద్యా రాజగుహ్యయోగ - శ్లోకం శ్లోక 14
శ్లోక 14
సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః |
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ||౯-౧౪||
అనువాదం
ఎల్లప్పుడూ నా దివ్య లీలలను/మహిమలను గానం చేస్తూ, దృఢ-సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తితో ఆరాధిస్తుంటారు.