కర్మయోగ - శ్లోకం శ్లోక 36
శ్లోక 36
అర్జున ఉవాచ |
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః |
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ||౩-౩౬||
అనువాదం
అర్జునుడు ఇలా అడిగాడు: ఓ వృష్ణి వంశీయుడా (శ్రీ కృష్ణా), ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానయినా, బలవంతంగా ఏదోశక్తి చేపించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును?