కర్మయోగ - శ్లోకం శ్లోక 15
శ్లోక 15
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ |
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ||౩-౧౫||
అనువాదం
మానవుల విహిత కర్మలు (కర్తవ్యములు) వేదములలో చెప్పబడ్డాయి, మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి, సర్వ-వ్యాపియైన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు.