కర్మయోగ - శ్లోకం శ్లోక 16
శ్లోక 16
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః |
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి ||౩-౧౬||
అనువాదం
వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు; అట్టి వారి జీవితము వ్యర్థం.