కర్మయోగ - శ్లోకం శ్లోక 12
శ్లోక 12
ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః |
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుఙ్క్తే స్తేన ఏవ సః ||౩-౧౨||
అనువాదం
యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు, జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటిని ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని, తిరిగి నివేదించకుండా, తామే అనుభవించే వారు, నిజానికి దొంగలే.