కర్మయోగ - శ్లోకం శ్లోక 13
శ్లోక 13
యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషైః |
భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్ ||౩-౧౩||
అనువాదం
యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే, ఆధ్యాత్మిక చింతనగల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునే వారు పాపమునే భుజింతురు.