పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 13
శ్లోక 13
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||౧౫-౧౩||
అనువాదం
పృథ్వి యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి, నేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి, సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను.