పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 1
శ్లోక 1
శ్రీభగవానువాచ |
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||౧౫-౧||
అనువాదం
శ్రీ భగవానుడు పలికెను: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు.