సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 61
శ్లోక 61
తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః |
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ||౨-౬౧||
అనువాదం
ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని, మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు.