సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 35
శ్లోక 35
భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః |
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ||౨-౩౫||
అనువాదం
ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారు, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు, అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.