సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 24
శ్లోక 24
అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః ||౨-౨౪||
అనువాదం
ఆత్మ, విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది; దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తనలేనిది, మరియు సనాతనమైనది.