పురుషోత్తమయోగ - శ్లోకం శ్లోక 8
శ్లోక 8
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్ ||౧౫-౮||
అనువాదం
ఎలాగైతే గాలి, సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీస్కువెళుతుందో, జీవాత్మ కూడా, పాత శరీరమును విడిచి, కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది.