కర్మయోగ - శ్లోకం శ్లోక 34
శ్లోక 34
ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ ||౩-౩౪||
అనువాదం
ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు/విషయములపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి, కానీ వాటికి వశము కాకూడదు, ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు.