కర్మయోగ - శ్లోకం శ్లోక 26
శ్లోక 26
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్ |
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్ ||౩-౨౬||
అనువాదం
కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా, ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని, జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. బదులుగా, జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ, అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను.