సాంఖ్యయోగ - శ్లోకం శ్లోక 21
శ్లోక 21
వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్ ||౨-౨౧||
అనువాదం
ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి, ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు?