కర్మయోగ - శ్లోకం శ్లోక 29
శ్లోక 29
ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్ ||౩-౨౯||
అనువాదం
గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనయిన వారు, వారి కర్మ ఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ, ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు, ఇది తెలియని అజ్ఞానులను కలవర పరచరాదు.