Telugu
శ్రీమద్భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 45
అర్జునవిషాదయోగ · శ్లోక 45
శ్లోక 45
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ||౧-౪౫||
అనువాదం
అయ్యో! ఎంత ఆశ్చర్యం, దారుణమైన పరిణామాలు కలిగించే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో, మన బంధువులనే చంపటానికి సిద్ధ పడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు, ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధభూమిలో చంపివేసినా సరే, అది దీనికంటే మేలే.
ఐఐటి కాన్పూర్ గిటా సూపర్ సైట్లో మరిన్ని అనువాదాలు, వ్యాఖ్యానాలు